నెట్టింట వైరల్‌గా మారిన సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ ట్వీట్..!

Published on Jan 3, 2022 11:01 pm IST

బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు షో కారణంగా రెండు ప్రేమ జంటలు విడిపోవాల్సి వస్తుందన్న టాక్ బయట బలంగా వినిపిస్తుంది. హౌస్‌లో సిరి-షణ్ముఖ్‌ల ప్రవర్తన కారణంగానే దీప్తి సునయన షణ్ముఖ్‌తో బ్రేకప్ చేసుకుందని చాలా మంది అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరి బ్రేకప్ జరిగినప్పటి నుంచి సిరి-శ్రీహాన్‌ జంట కూడా త్వరలోనే బ్రేకప్ చెప్పుకోవడం గ్యారెంటీ అని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

దీంతో ఈ జంట సోషల్ మీడియా అకౌంట్లపై నెటిజన్లు ఓ కన్నేసి ఉంచారు. అయితే నేడు సిరి బర్త్‌డే సందర్భంగా శ్రీహాన్‌ ఇన్‌స్టా వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేశాడు. హ్యాపీ బర్త్‌డే సిరి ఈ సంవత్సరం పాజిటివ్‌ వైబ్స్‌తో నీ జీవితం సాగాలని ఆశిస్తున్నానని, నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావని, ఆ దేవుడి ఆశీస్సులు నీకుంటాయని ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. అయితే బిగ్‌బాస్ నుంచి సిరి బయటకొచ్చిన తర్వాత శ్రీహాన్‌తో కలిసి ఎక్కడా కనిపించలేదు. దీంతో దీప్తి-షణ్ముక్‌ల మాదిరిగానే ఈ జంట కూడా విడిపోతారని ఊహగానాలు వినిపిస్తున్న తరుణంలో శ్రీహాన్ నేడు సిరికి బర్త్‌డే విషెష్ చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశమని చెప్పాలి.

సంబంధిత సమాచారం :