స్పెషల్ సాంగ్ కు సిద్దమైన శ్రియ !


సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చాన్నాళ్లపాటు కొనసాగి, దడపా అందరు స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్ శ్రియ శరన్ ప్రస్తుతం సెలెక్టివ్ సబ్జెక్ట్స్ మాత్రమే ఎంచుకుంటున్నారు. చివరగా బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో నటించిన ఈమె బాలయ్య 101వ చిత్రంలో సైతం నటిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఆమె తాజాగా ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు.

గతంలో ‘దేవదాసు, తులసి, మున్నా, పులి’ వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో అలరించిన శ్రియ ఇప్పుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘నక్షత్రం’ లో సైతం ప్రత్యేక పాటలో మెరవనుంది. సినిమాలో ప్రత్యేకంగా ఉండనున్న ఈ పాటకు శ్రియ అయితే అన్ని విధాల బాగుంటుందని భావించిన కృష్ణవంశీ ఆమెను సంప్రదించారట. పాట యొక్క సందర్భం, ప్రాముఖ్యం విన్న శ్రియ కుడా వెంటనే ఓకే చెప్పారట.