చెన్నై లో సూర్య42 కొత్త షెడ్యూల్ షురూ!

చెన్నై లో సూర్య42 కొత్త షెడ్యూల్ షురూ!

Published on Nov 27, 2022 8:18 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి యాక్షన్ డ్రామాలో సిరుత్తై శివ దర్శకత్వంలో కనిపించనున్నారు. ఈ బిగ్గీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కథానాయిక గా నటిస్తుంది. తాజా సమాచారం ఏంటంటే, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు చెన్నైలో ప్రారంభమైంది.

సూర్యతో పాటు ఇతర కీలక తారాగణం సెట్స్‌లోకి చేరింది. సూర్య42 మూవీ 10 భాషల్లో, 2డి మరియు 3డి ఫార్మాట్లలో విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ ను నిర్మించేందుకు స్టూడియో గ్రీన్ మరియు యువి క్రియేషన్స్ చేతులు కలిపాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు