‘గౌతమి పుత్ర శాతకర్ణి’లో శ్రియ లుక్ ఇదే..!

11th, September 2016 - 06:09:08 PM

shrya
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 100వ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ తెలుగు సినీ పరిశ్రమలో కొద్దికాలంగా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ చారిత్రక సినిమా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక నేడు ఈ సినిమాలో హీరోయిన్ అయిన శ్రియ పుట్టినరోజును పురస్కరించుకొని దర్శకుడు క్రిష్ శ్రియ సినిమాలో ఎలా ఉంటారో పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.

గౌతమి పుత్ర శాతకర్ణిలో శ్రియ శాతకర్ణి భార్య అయిన వశిష్టి దేవిగా కనిపించనున్నారు. ఈ లుక్‌లో శ్రియ వశిష్టి దేవి పాత్రకు వన్నె తెచ్చే రీతిలో కనిపిస్తూ మెప్పిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డితో కలిసి క్రిష్ స్వయంగా నిర్మిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగ్స్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను క్రిష్, బాలయ్య కెరీర్‌కు మరపురాని సినిమాగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నారు.