తన ఫోన్ నెంబర్ అడిగితే అదిరే రిప్లై ఇచ్చిన శృతి హాసన్!

Published on Oct 5, 2021 11:00 am IST

నిన్న దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ సహా వాట్సప్ లు డౌన్ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సమయం ఈ యాప్స్ డౌన్ అయ్యాయట. ఇక ఇదిలా ఉండగా ఈ సమయంలో మన సినిమా స్టార్స్ అంతా ట్విట్టర్ లోకే వచ్చి పడ్డారు.

వచ్చి బోర్ కొట్టడంతో పలువురు చాట్ సెషన్స్ కూడా పెట్టారు. అలా తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ అయినటువంటి శృతి హాసన్ కూడా ఒక చాట్ సెషన్ ని పెట్టి తనని ఏమన్నా అడగాలి అనుకుంటే అడగొచ్చని చెప్పింది. మరి ఈ క్రమంలో ఓ నెటిజన్ శృతి హాసన్ ని తన నెంబర్ అడగగా దానికి శృతి అదిరే రిప్లై ఇచ్చి పడేసింది.

అతడు అడిగిన ప్రశ్నకు జవాబుగా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ ‘100’ అని రిప్లై ఇచ్చింది. దీనితో ఈ రిప్లై చూసి అంతా నవ్వుతున్నారు. దెబ్బకు ఇది వైరల్ కూడా అవ్వడం మొదలయ్యింది. ప్రస్తుతం అయితే శృతి హాసన్ ప్రభాస్ తో భారీ చిత్రం “సలార్” సహా పలు తమిళ్ సినిమాల్లో బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం :