ఆ సినిమాలో నటించకుండా ఉండాల్సింది – శృతిహాసన్

Published on Feb 20, 2022 5:04 pm IST

హీరోయిన్ శృతిహాసన్ ఏమి మాట్లాడినా ఓపెన్ గా మాట్లాడుతుంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 2016 లో వచ్చిన తెలుగు ప్రేమమ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఆ సినిమాలో నేను పోషించిన మలర్ పాత్రను మలయాళ ఒరిజినల్ వెర్షన్ సాయిపల్లవితో పోల్చి నన్ను అప్పట్లో బాగా ట్రోల్స్ చేశారు. అప్పుడు నేను కొంచెం బాధ పడ్డాను.

ఆ ట్రోల్స్ చూశాకా, అసలు నేను ప్రేమమ్ సినిమా రీమేక్‌ లో నటించకుండా ఉండాల్సింది అని ఒకానొక సమయంలో బాగా ఫీల్ అయ్యాను అని ఆమె వెల్లడించింది. అయితే అలా ఫీల్ అయ్యింది కాసేపే అని, ఆ తర్వాత.. మళ్లీ నార్మల్ అయ్యానని, మలర్ పాత్రను చేసినప్పుడు ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశానని శృతిహాసన్ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :