మనీ బదులు స్పెషల్ సాంగ్ చేస్తానన్న శృతి హాసన్

Shruthi-Hassan1
ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీ గా ఉన్నా హాట్ అండ్ క్రేజీ హీరోయిన్ శృతి హాసన్. నాగార్జున – కార్తీ కలిసి వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చేయనున్న సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకోవడంతో పివిపి వారి పిక్చర్ హౌస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు శృతి పై కేసు పెట్టడం, ఆ కేసు కోర్టుకి వెళ్ళడం, మళ్ళీ కేసు విత్ డ్రా చేసుకోవడం లాంటివి జరిగిపోయాయి. తమిళ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మరియు సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఇద్దరూ కలిసి ఈ విషయాన్ని డీల్ చేసారు.

పివిపి వారు నాగార్జున – కార్తీ సినిమా కోసం శృతి హాసన్ కి 10 లక్షల అడ్వాన్స్ తో పాటు, తన కాస్ట్యూమ్స్ కి 8 లక్షలు ఖర్చు చేసారు. ఇది తిరిగి కట్టాలని పివి వారు డిమాండ్ చేయడంతో శృతి హాసన్ మాత్రం ఆ డబ్బుకు బదులుగా ఫ్రీగా అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సైన్ జీరో’లో ఓ స్పెషల్ సాంగ్ చేస్తానని తెలిపింది. అందుకోసం వారు అడిగిన 4 రోజుల డేట్స్ కూడా ఇచ్చింది. చెప్పాలంటే సైజ్ జీరోలో శృతి హాసన్ హాసన్ ఓ కీ రోల్ మరియు ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. ఇప్పుడు స్పెషల్ ఫ్రీగా చేయనుంది. ఒకవేళ మళ్ళీ చివర్లో శృతి ఆ సాంగ్ చేయకపోతే తమ మోనే వెనక్కి ఇవ్వాలని పివిపి వారు ముందే సూచించారు.

Exit mobile version