
చేపలు, రొయ్యలు, సి ఫుడ్స్ ఇష్టంగా తినే శృతి హాసన్ ఇక నుండి వాటి జోలికి వెళ్ళడం లేదు. ఎంతో ఇష్టమైన నాన్ వెజ్ తినడం పూర్తిగా మానేసింది. శాకాహారిగా మారిపోయింది. ఈ మార్పు వెనుక కారణం శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ కారణమట. శృతి హాసన్ ఈ విషయాన్నీ స్వయంగా ట్విట్టర్లో వెల్లడించింది. ‘మా బాపూజీ(కమల్ హాసన్)కి థాంక్స్. ఆయన సలహాతో నేను వెజిటేరియన్ గా మారాను. చాలా బాగుంది, కాని రొయ్యలు తింటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అంటూ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషలలో సినిమాలో చేస్తున్న శృతి అగ్ర హీరోయిన్ల రేసులో ఉంది. నువ్వు నీ ఆరోగ్యం ఇలాగే కాపాడుకోవాలంటే నాన్ వెజ్ తినడం పూర్తిగా మానేయమని కమల్ సలహా ఇచ్చారట. ఆ ప్రయత్నాలలో శృతి హాసన్ ఉంది.