సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో, మైత్రి మూవీస్ నిర్మాణ సారధ్యంలో త్వరలోనే ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ విషయాన్నీ ఖరారు చేస్తూ ఇటీవలే ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. కానీ అందులో హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తావించలేదు.
ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో మహేష్ సరసన శృతి హాసన్ ఖరారైనట్టు ఎక్కువగా వినిపిస్తోంది. మహేష్ బాబు కూడా శృతి హాసన్ ని ఓకే చేసినట్టు సమాచారం. ఇక ఈ విషయం పై అధికారిక ప్రకటన రావడమే మిగిలి ఉంది. ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
