ట్రైనింగ్ కోసం లండన్ వెళ్లిన శృతి హాసన్ !
Published on Apr 19, 2017 4:19 pm IST


సౌత్ పరిశ్రమలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ తో కలిసి ‘శభాష్ నాయుడు’ లో నటిస్తూనే భారీ ప్రాజెక్ట్ ‘సంఘమిత్ర’ కోసం సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు సుందర్. సి దర్శకత్వంలో సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి ఒక రాకుమారి పాత్రలో నటించనుంది. సినిమా మొత్తం చారిత్రక నైపథ్యం కలిగి ఉంటుంది కనుక అందులో యుద్ధ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయట.

శృతి హాసన్ కూడా ఇలాంటి సన్నివేశాల్లో నటించాల్సి ఉందట. అందుకే ఆమె ముందుగానే కత్తి యుద్ధం, మల్ల యుద్ధం వంటి వాటిని ప్రాక్టీస్ చేస్తోంది. అది కూడా ఇండియాలో కాదు. లండన్ లో ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ వద్ద ఈ యుద్ధ విద్యలను నేర్చుకుంటోంది శృతి. శ్రీ తెండాళ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండగా జయం రవి, ఆర్యలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 
Like us on Facebook