తమన్నా కోసం శృతి హాసన్ గొంతు సవరించుకుంటోంది

27th, August 2016 - 08:38:09 PM

shrutihasan
మిల్కీ బ్యూటీ తమన్నా తమిళంలో విశాల్ సరసన ‘కత్తి సందై; అనే చిత్రంలో నటిస్తోంది. సూరజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ తమన్నాపై ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఆ పాటను మరో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ స్వయంగా పాడనుందట. స్వతహాగా ప్లే బ్యాక్ సింగరైన శృతి హాసన్ మొదట కమల్ హాసన్ కూతురిగానే ఇండస్ట్రీకి వచ్చి ఆ తరువాత తనలో ఉన్న అన్ని టాలెంట్లను ఒక్కొక్కటిగా బయటపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే శృతి హాసన్ తో అన్ని చర్చలు అయిపోయాయని, త్వరలోనే సాంగ్ రికార్డింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ నెల 29న విశాల్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేసి అక్టోబర్ 29న దీపావళి కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు.