వైరల్ : రోజ్ తింటూ క్యూట్ ఫోజు లో శృతి హాసన్

Published on Jul 21, 2022 10:30 pm IST

యువ నటి శృతి హాసన్ ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సినిమాల వేగం పెంచారు అనే చెప్పాలి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ , మెగాస్టార్ చిరంజీవి, బాబీ ల మూవీ, బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబో మూవీస్ చేస్తున్నారు. భారీ క్రేజీ కాంబినేషన్స్ లో ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూడు మూవీస్ పెద్ద సక్సెస్ అయితే హీరోయిన్ గా శృతి క్రేజ్ విపరీతంగా పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

ఇక ఇతర నటీనటుల మాదిరి శృతి కూడా ఎప్పటికప్పుడు తన సినీ, పర్సనల్ విషయాలు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆడియన్స్, ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. లేటెస్ట్ గా ఆమె రెడ్ కలర్ ట్రెండీ స్టైల్ డ్రెస్ ధరించి క్యూట్ ఫోజులో రెడ్ రోజ్ తింటూ ఒక క్యూట్ వీడియో ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. తన లైఫ్ లో తొలిసారిగా రోజ్ ఫ్లవర్ తిన్నానని, ఫైనల్ గా కుదిరిందా లేదా అంటూ శృతి హాసన్ సరదాగా నవ్వుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ క్యూట్ వీడియో పై ఒక స్వీట్ లుక్ వేయండి మరి.

సంబంధిత సమాచారం :