రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 28, 2023 న రిలీజ్ కావల్సి ఉండగా, అనుకొని కారణాల వలన వాయిదా పడింది. ఈ చిత్రం రిలీజ్ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఈ హీరోయిన్ గతంలో ప్రభాస్ పై, సలార్ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మరోసారి శృతి హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సలార్ మూవీ లార్జర్ దేన్ లైఫ్ అని, ప్రభాస్ చాలా వండర్ ఫుల్, హంబుల్ అంటూ చెప్పుకొచ్చారు. శృతి హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందించారు.