‘కాటమరాయుడు’లో చాలా మార్పులున్నాయంటున్న శృతి హాసన్ !

22nd, February 2017 - 06:16:25 PM


భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న పవన్ కళ్యాణ్ చిత్రం ‘కాటమరాయుడు’లో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ విజయంగా నిలిచిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటించిన శృతి హాసన్ ఈ చిత్రంలో కూడా చేస్తుండటంతో పాత సెంటిమెంట్ రిపీటై ‘కాటమరాయడు’ పెద్ద విజయం సాదిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే ఈ చిత్రం గురించి మాట్లాడిన శృతి హాసన్ పలు కీలకమైన విశేషాలను తెలియజేశారు.

సాధారణంగా రీమేక్ అంటే ఉన్నది ఉన్నట్టు తీస్తారని అనుకుంటున్నారు. కానీ ‘కాటమరాయుడు’ అలా కాదు. ‘వీరమ్’ కి దీనికి చాలా తేడాలున్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఇందులో చాలా మార్పులు చేశారు. రెండింటినీ పోల్చి చూడలేం. పూర్తి స్థాయి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది అన్నారు. కిశోర్ కుమార్ అలియాజ్ డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మార్చి నెలలో రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.