శ్రుతి హాస‌న్ కూడా భ‌య‌పెడుతుందా..?

శ్రుతి హాస‌న్ కూడా భ‌య‌పెడుతుందా..?

Published on Jul 6, 2024 1:00 AM IST

స్టార్ బ్యూటీ శ్రుతి హాస‌న్ ప్ర‌స్తుతం వ‌రుసబెట్టి సినిమాలు చేస్తోంది. భాష‌తో సంబంధం లేకుండా ఆమె సినిమాల‌ను ఓకే చేస్తోంది. ఆమె త‌మిళంలో ప్ర‌స్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ న‌టిస్తున్న ‘కూలి’ మూవీలో న‌టిస్తోంది. ఈ సినిమాలో ర‌జినీ కూతురి పాత్ర‌లో శ్రుతి క‌నిపించ‌నుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ బ్యూటీ, తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్టును ఓకే చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ త్వ‌ర‌లో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట. ఈ సినిమా హార్ర‌ర్ అంశాల‌తో తెర‌కెక్క‌నుంద‌ని.. ఈ సినిమాలో మెయిల్ లీడ్ లో న‌టించేందుకు శ్రుతి హాస‌న్ ఓకే చేసిన‌ట్లుగా సినీ స‌ర్కిల్స్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

‘భాగ‌మ‌తి’ సినిమా త‌రువాత యువీ క్రియేష‌న్స్ లేడీ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్ చేయ‌లేదు. అందుకే ఈ సినిమాతో మ‌రోసారి లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ను ట‌చ్ చేయాల‌ని ప్రొడ్యూస‌ర్స్ భావిస్తున్నారు. అన్నీ ఓకే అయితే ఈ సినిమాను అతి త్వ‌ర‌లో ప‌ట్టాలెక్కించ‌డం ఖాయ‌మని తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ వ‌స్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు