‘దేవ‌ర’ షూటింగ్ లో జాయిన్ అయిన న‌టి.. ఎవ‌రంటే?

‘దేవ‌ర’ షూటింగ్ లో జాయిన్ అయిన న‌టి.. ఎవ‌రంటే?

Published on Jul 8, 2024 4:05 PM IST


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘దేవ‌ర’ కోసం ప్రేక్ష‌కులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టంతో దేవ‌ర మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సునామీ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, ఫియ‌ర్ సాంగ్ ఈ సినిమాపై అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి.

అయితే, ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఈ సినిమాలో మ‌రో న‌టి శ్రుతి మ‌రాఠే కూడా న‌టిస్తోంది. ఎన్టీఆర్ భార్య పాత్ర‌లో శ్రుతి న‌టిస్తోంది. తాజాగా ఆమె హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న‌ ‘దేవ‌ర’ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఈమేర‌కు తన ఇన్స్టా స్టోరీలో అప్డేట్ ఇచ్చింది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యువ‌సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు