మాస్ట్రో నుండి షురూ కరో ప్రమోషనల్ సాంగ్ విడుదల!

Published on Sep 12, 2021 8:26 pm IST

నితిన్ హీరోగా, తమన్నా భాటియా, నబ్బా నటేష్ లు హీరోయిన్ లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మాస్ట్రో. ఈ చిత్రం బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన అంధ దూన్ కి ఈ చిత్రం రీమేక్. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు మరియు ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి షురూ కరో అంటూ ఒక ప్రమోషనల్ సాంగ్ విడుదల అయింది.

ఈ పాట కి శ్రీమణి లిరిక్స్ రాయగా, రేవంత్ పాడారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, రాజ్ కుమార్ ఆకెళ్ళ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :