రేపు “కొండపొలం” నుండి విడుదల కానున్న శ్వాసలో లిరికల్ సాంగ్!

Published on Sep 29, 2021 7:35 pm IST

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కొండపొలం. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు సినిమా పై ఆసక్తి పెంచేశాయి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి మరియు జే. సాయి బాబు లు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 8 వ తేదీన థియేటర్ల లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం నుండి తాజాగా శ్వాసలో పాట కి సంబంధించిన ప్రోమో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటకి సంబందించిన పూర్తి లిరికల్ వీడియో ను రేపు సాయంత్రం 4:45 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, కోట శ్రీనివాస్ రావు, నాజర్, అన్నపూర్ణ, హేమ, ఆంతొని, రవి ప్రకాష్, మహేష్ విట్టా, రచ్చ రవి, ఆనంద్ విహారి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :