‘శ్యామ్ సింగరాయ్’ 11 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్..!

Published on Jan 5, 2022 2:30 am IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా “శ్యామ్ సింగరాయ్”. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ని సొంతం చేసుకుని తొలి రోజు నుంచి మొన్నటి వరకు మంచి కలెక్షన్లనే రాబట్టుకుంది. అయితే నిన్న మాత్రం ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయినట్టు తెలుస్తుంది. నిన్న్న 11వ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కేవలం 17 లక్షల షేర్ మాత్రమే వచ్చిందని, ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల వరకు మాత్రమే వసూలు వచ్చినట్టు తెలుస్తుంది.

11 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్:

* నైజాం – 9.20 కోట్లు
* సీడెడ్ – 2.60 కోట్లు
* ఉత్తరాంధ్ర – 2.10 కోట్లు
* ఈస్ట్ – 1.06 కోట్లు
* వెస్ట్ – 0.84 కోట్లు
* గుంటూరు – 1.14 కోట్లు
* కృష్ణా – 0.92 కోట్లు
* నెల్లూరు – 0.62 కోట్లు
* తెలంగాణ+ఏపీ 11 డేస్ కలెక్షన్స్ – 18.46 కోట్లు (32.06 కోట్లు గ్రాస్)
* కర్ణాకట+రెస్ట్ ఆఫ్ ఇండియా – 2.86 కోట్లు
* ఓవర్సీస్ – 3.49 కోట్లు
* మొత్తం 11 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 24.80 కోట్లు (43.95 కోట్లు గ్రాస్)

సంబంధిత సమాచారం :