‘శ్యామ్ సింగరాయ్’ ఏపీ తెలంగాణ లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Dec 27, 2021 3:04 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఈ చిత్రం మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. మొదటి షో నుండి దాదాపు అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ గా ప్రదర్శింప బడుతోంది. కాగా ‘శ్యామ్ సింగరాయ్’ నైజాం 3వ రోజు వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో 3 వ రోజు ‘శ్యామ్ సింగరాయ్’ 1.5 కోట్ల రూపాయలు షేర్ ని రాబట్టి డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.

అలాగే ఆంద్రలో 3వ రోజుకు గానూ 1.42 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టింది. ఇక సీడెడ్ విషయానికి వస్తే.. 3వ రోజు గానూ 48 లక్షలు వసూలు చేసింది. మొత్తం చూస్తే.. 3వ రోజు గానూ ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని : 3.4 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాను ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. నాని నటనకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి కథానాయికలుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :