టార్గెట్‌ని బ్రేక్ చేసిన “శ్యామ్ సింగరాయ్”..!

Published on Jan 4, 2022 2:01 am IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా “శ్యామ్ సింగరాయ్”. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ని సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను రాబడుతుంది.

అయితే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా రూ.22.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగగా దానిని ఇప్పుడు బ్రేక్ చేసి రూ.2.07 కోట్ల లాభంతో దూసుకెళ్తుందని తెలుస్తుంది. కాగా గత 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.24.57 కోట్ల షేర్ వసూల్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.18.29 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.2.80 కోట్లు, ఓవ్ర్సీస్‌లో రూ.3.48 కోట్లు వసూల్ చేసింది.

సంబంధిత సమాచారం :