ఓవర్సీస్ లో నిలకడగా దూసుకెళ్తున్న నాని సినిమా.!

Published on Jan 2, 2022 10:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “శ్యామ్ సింగ రాయ్”. ఈ సినిమాతోనే మళ్ళీ నాని థియేటర్స్ లోకి ఎంటర్ అయ్యి సాలిడ్ కం బ్యాక్ ని అందుకున్నాడు. అయితే ఈ సినిమా అటు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ అందుకొని స్ట్రాంగ్ వసూళ్లు కొల్లగొట్టింది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో డీసెంట్ హోల్డ్ ని కనబరిచింది అని చెప్పాలి.

యూఎస్ లో ఈ చిత్రం ప్రీమియర్స్ తర్వాత ప్రతి రోజు కూడా మినిమమ్ 50 వేల డాలర్లును రాబడుతూ ఇదే నిలకడగా కొనసాగుతూ వెళుతుంది. మరి ఇలా ఈ చిత్రం ఇప్పుడు అక్కడ 7 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని లేటెస్ట్ గా క్రాస్ చేసింది. ఇంకా కొన్ని రోజులు వరకు ఏ పెద్ద సినిమాలు లేవు కాబట్టి శ్యామ్ సింగ రాయ్ హవా కొనసాగుతుంది అని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించాడు. అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :