నైజాంలో “శ్యామ్ సింగ రాయ్” డే 1 డీసెంట్ కలెక్షన్.!

Published on Dec 25, 2021 1:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “శ్యామ్ సింగ రాయ్”. టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమా నాని కెరీర్ లోనే అధిక బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

అయితే ఈ చిత్రం టీజర్ కి ముందు తర్వాత భారీ అంచనాలు నెలకొల్పుకున్నా తర్వాత మాత్రం డీసెంట్ బజ్ నడుమే నిన్న రిలీజ్ అయ్యింది. మరి నైజాం లో ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. మొదటి రోజు నైజాం లో శ్యామ్ సింగ రాయ్ 1.6 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది.

ఇది అక్కడ ఈ సినిమాకి ఒక డీసెంట్ స్టార్ట్ అని చెప్పాలి. ఆల్రెడీ సినిమాలో మ్యాటర్ ఉందని మంచి మౌత్ టాక్ కూడా స్టార్ట్ అయ్యింది. దీనితో ఈ మూడు రోజులు కూడా మంచి వసూళ్లు ఈ చిత్రం రాబడుతుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :