సింపుల్ అండ్ ఇంటెన్స్ గా “శ్యామ్ సింగ రాయ్” లో డిలీటెడ్ సీన్.!

సింపుల్ అండ్ ఇంటెన్స్ గా “శ్యామ్ సింగ రాయ్” లో డిలీటెడ్ సీన్.!

Published on Jan 22, 2022 1:00 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నాచురల్ బ్యూటీ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా “శ్యామ్ సింగ రాయ్”. గత డిసెంబర్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం నాని కెరీర్ లో మంచి హిట్ గా కూడా నిలిచింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నిన్నటి నుంచే స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు తమిళ్ మరియు మళయాళ భాషల్లో స్ట్రీమింగ్ కు కూడా వచ్చేసింది.

మరి మేకర్స్ ఈ సినిమా మరింత రీచ్ అయ్యేలా ఈరోజు నుంచి ఈ సినిమాలో ఇప్పటి వరకు పెట్టని కొన్ని సీన్స్ ని వదులుతున్నారు. అలా ఈ సినిమా నుంచి ఫస్ట్ డిలీటెడ్ సీన్ ని రివీల్ చేశారు. అయితే ఈ సీన్ మాత్రం మంచి సింపుల్ అండ్ ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. శ్యామ్ ఎక్కడో వేశ్యల నివాసంలో ఉన్నట్టు కనిపిస్తాడు.

వారందరి మధ్య రచయితగా తన పని ఏదో రాసుకుంటున్నపుడు అతడిని అక్కడుండే ఒకామె కొంటెగా అడుగుతుంది తనని పెళ్లి చేసుకోమని.. అక్కడ చిన్న సందిగ్ధం అయినా శ్యామ్ తప్పకుండా చేసుకుంటా అని చెప్తాడు. కాకపోతే ప్రేమిస్తేనే అన్నట్టు చెప్తాడు. అంటే శ్యామ్ దృష్టిలో ప్రేమకి ఎంత విలువ ఉన్నదో అనేది ఈ చిన్న సన్నివేశం తెలుపుతుంది. మరి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇపుడు ఆడియెన్స్ ని మరోసారి అలరిస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు