“శ్యామ్ సింగరాయ్” ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్..!

“శ్యామ్ సింగరాయ్” ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్..!

Published on Jan 1, 2022 1:02 AM IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా “శ్యామ్ సింగరాయ్”. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ని సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను రాబడుతుంది.

అయితే ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్లను చూసుకుంటే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.20.80 కోట్లు వసూల్ చేసినట్టు తెలుస్తుంది. ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.14.92 కోట్లు(రూ.25.28 కోట్ల గ్రాస్), కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.2.50 కోట్లు, ఓవర్సీస్ రూ.3.38 కోట్లు రాబట్టింది. అయితే మరో వారం రోజుల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ని దాటుతుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు