“శ్యామ్ సింగ రాయ్” హవా కూడా తగ్గడం లేదు.!

Published on Jan 29, 2022 9:04 am IST


రీసెంట్ గా టాలీవుడ్ నుంచి అటు థియేట్రికల్ గా అలాగే మరో పక్క ఓటిటి లో కూడా బ్లాక్ బస్టర్ అయ్యిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. మరి వాటిలో అఖండ, పుష్ప చిత్రాలతో పాటు నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “శ్యామ్ సింగ రాయ్” కూడా ఒకటి. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో వచ్చి మరింత మందికి చేరువ అయ్యింది.

మరి ఇక్కడ నుంచి ఇతర భాషల్లో కానీ పలువురు స్టార్ నుంచి కానీ రెస్పాన్స్ ని అయితే ఇంకా అందుకుంటూ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాని, సాయి పల్లవి ల పెర్ఫామెన్స్ మరియు ఈ సినిమాలో పునర్జన్మల నేపథ్యం ప్రతి ఒక్కరిని మరింత మెప్పించడంతో తమ రెస్పాన్స్ ని సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. ఇక రీసెంట్ గా సీనియర్ నటి మధూ కూడా తన స్పందనను తెలియజేయడంతో సాయి పల్లవి కూడా ఎమోషనల్ రిప్లై ఇచ్చింది. ఇలా శ్యామ్ సింగ రాయ్ హవా కూడా ఇపుడు కొనసాగుతుంది.

సంబంధిత సమాచారం :