“శ్యామ్ సింగరాయ్” నాకు రచయితగా మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది – సత్యదేవ్ జంగా

Published on Dec 21, 2021 10:30 pm IST


నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాకు కథను అందించిన జంగా సత్యదేవ్ ఇటీవల ఓ ఇంటార్వ్యూలో మాట్లాడుతూ వినూత్నమైన కథాంశంతో రానున్న ఈ సినిమా రచయితగా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని, కథ విన్న వెంటనే నాని ఓకే చేశారని, ఈ చిత్రంలో నాని పలు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారని అన్నారు. శ్యామ్ సింగరాయ్ కథతో తనకంటూ ఒక కొత్త డిఫరెంట్ నేమ్ తెచ్చుకున్న సత్యదేవ్ జంగా భవిషత్తులో హర్రర్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా కథలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఒక ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్స్ ప్రముఖ బ్యానర్ ఓకె చేసింది, త్వరలో వాటి వివరాలు సత్యదేవ్ జంగా అధికారికంగా ప్రకటించనున్నారు.

దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ శ్యామ్ సింగరాయ్ కథను అద్భుతంగా చిత్రీకరించినందుకు సంతోషాన్ని వెళ్లబుచ్చారు. ఈ విషయంలో సపోర్ట్ చేసిన నాని గారికి, నిర్మాత వెంకట్ బోయినపల్లి గారికి ధన్యవాదాలు తెలిపారు సత్యదేవ్ జంగా. తన భవిషత్తు ప్రణాళికలో భాగంగా ఒక స్టార్ హీరో కోసం సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ సిద్ధం చేస్తున్నారు. అలాగే కాశి బ్యాక్ డ్రాప్ లో ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ సిద్ధం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :