“శ్యామ్ సింగరాయ్” స్క్రీన్ ప్లే చాలా కాంప్లికేటెడ్‌గా ఉందట?

Published on Dec 16, 2021 3:00 am IST


నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేశారు.

కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌తో 1970 కాలం నాటి క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించారు. ఇందులో టైం ట్రావెల్ వంటి కాన్సెప్ట్ కూడా ఉన్నాయని, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉండబోతున్నాయని, స్క్రీన్ ప్లే చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుందేమోనని అనిపిస్తుంది. దీంతో సినిమా ఆడియెన్స్ కి అర్థమవుతుందో లేదోనని అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ స్క్రీన్‌ప్లే కనుక ప్రేక్షకులకి అర్థమైతే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని కొందరు అంటున్నారు. చూడాలి మరీ ఈ సినిమా ఏ మేరకు హిట్ అందుకుంటుందో.

సంబంధిత సమాచారం :