‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..!

Published on Nov 3, 2021 1:31 am IST


నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో, చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన విడుదల కానుంది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ పేరుతో సాగే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ నెల 6వ తేదీన ఈ పాటను ఫస్ట్‌ సింగిల్‌ పేరుతో బయటకు వదలనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా, విశాల్ దద్లాని, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More