‘ప్రణవాలయ’ సాంగ్‌లో సాయి పల్లవి అద్భుతమైన డ్యాన్స్..!

Published on Dec 19, 2021 1:50 am IST


నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నేడు ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ప్రణవాలయ పాహి.. పరిపాలయల పరమేసి..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో సాయి పల్లవి దేవదాసి పాత్రలో నాటక రూపంలో మహంకాళి అమ్మవారిగా కనిపించింది. సాయి పల్లవి చేసిన అద్భుతమైన డాన్స్, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ సాంగ్‌కి హైలెట్‌గా నిలిచాయి. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్ కొరియోగ్రఫీ చేశారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :