‘శ్యామ్ సింగరాయ్’ వెనక్కి తగ్గే ఆలోచన చేస్తున్నాడా?

Published on Oct 30, 2021 2:22 am IST


నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో, చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన విడుదల కానుంది.

అయితే డిసెంబర్ 17వ తేదీన ‘పుష్ప’ వస్తున్నా కూడా శ్యామ్ సింగరాయ్ వెనక్కి తగ్గే ఆలోచన చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కారణం డిసెంబర్ 24వ తేదీన బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ సినిమా ‘అఖండ’ను విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇదే కనుక జరిగితే డిసెంబర్ 24వ తేదీ నుంచి శ్యామ్ సింగరాయ్ తప్పుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More