“శ్యామ్ సింగరాయ్” ట్రైలర్ వచ్చేసింది..!

Published on Dec 14, 2021 9:01 pm IST


నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.

కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌తో 1970 కాలం నాటి క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించారు. తన పాత్రకు తగ్గట్టుగా నాని ఇందులో ఒదిగిపొయి నటించినట్టు తెలుస్తుంది. ఆయన చెప్పిన డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ముగ్గురు నాయికలు ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ అందించిన మ్యూజిక్ కూడా అదిరిపోయిందని చెప్పాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :