‘శ్యామ్ సింగరాయ్’ ఆ విషయంలో ఆలోచనలో పడ్డాడు?

Published on Nov 16, 2021 3:03 am IST


నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో, చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన విడుదల కానుంది. అయితే సోలో రిలీజ్ డేట్‌ను నాని భలే సెట్ చేసుకున్నాడని, కలెక్షన్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని అంతా అనుకున్నారు.

ఈ సినిమాకి పోటీ ఇచ్చేందుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన “గని” చిత్రం రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాని తొలుత డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు కానీ చివరకు డిసెంబర్ 24వ తేదికి వాయిదా వేసుకున్నారు. నానికి వరుణ్ తేజ్ అడ్డుపడడంతో ‘శ్యామ్ సింగరాయ్’ ఆలోచనలో పడ్డాడని టాక్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More