నెట్ ఫ్లిక్స్ లో “శ్యామ్ సింగ రాయ్” సెన్సేషన్.!

నెట్ ఫ్లిక్స్ లో “శ్యామ్ సింగ రాయ్” సెన్సేషన్.!

Published on Jan 27, 2022 3:10 PM IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “శ్యామ్ సింగ రాయ్” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కి నాని కెరీర్ లోనే మరో మరపురాని హిట్ గా నిలిచింది. మరి థియేటర్స్ లో సాలిడ్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం రీసెంట్ గానే దిగ్గజ ఓటిటి స్టీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

మరి రావడంతోనే ఈ సినిమా భారీ వ్యూవర్ షిప్స్ తో మంచి రెస్పాన్స్ ని కూడా కొల్లగొట్టగా.. వారు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పెర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉందో వెల్లడించారు. టాప్ 10 నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో “శ్యామ్ సింగ రాయ్” సినిమా మాత్రమే టాప్ 3 లో నిలిచి ఏకైక ఇండియన్ సినిమాగా నిలిచింది.

మరి అంతే కాకుండా ఈ సినిమాని నిన్నటికి 35 లక్షల 90 గంటలకి పైగా వ్యూవర్స్ స్ట్రీమింగ్ చేసినట్టు తెలిపారు. ఈ రకంగా సెన్సేషనల్ రెస్పాన్స్ తో టాప్ 3 లో ఈ సినిమా నిలిచింది. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు