‘శ్యామ్ సింగరాయ్’ నుంచి “సిరివెన్నెల” ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..!

Published on Jan 18, 2022 11:52 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. గత ఏడాది డిసెంబర్ 24వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాలోని దివంగత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి గీతం “సిరివెన్నెల” ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది.

ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా, మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటించారు. జనవరి 21నుంచి నెట్‌ప్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :