యూఎస్ లో సాలిడ్ రన్ కనబరుస్తున్న “శ్యామ్ సింగ రాయ్”.!

Published on Dec 29, 2021 10:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “శ్యామ్ సింగ రాయ్” థియేటర్స్ లో రిలీజ్ అయ్యి తన కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం మంచి రన్ ని కనబరుస్తూ సినిమా సాలిడ్ వసూళ్లను రాబడుతూ కొనసాగుతుంది. మరి లేటెస్ట్ గా ఈ సినిమా యూఎస్ఏ లో వసూళ్ల వివరాలు మేకర్స్ రివీల్ చేసారు.

ఈ చిత్రం ఇప్పుడు 6 లక్షల యూఎస్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసిందట. అంతే కాకుండా అదనంగా 20 కొత్త థియేటర్స్ యాడ్ చెయ్యడంతో పాటుగా అక్కడ రెండో వారంలో శ్యామ్ సింగ రాయ్ చిత్రం 200 థియేటర్స్ లో ప్రదర్శితం అవుతున్నట్టు వారు తెలిపారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించాడు. అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాని తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :