స్ట్రాంగ్ హోల్డ్ లో “శ్యామ్ సింగ రాయ్” యూఎస్ వసూళ్లు.!

Published on Dec 28, 2021 1:11 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించిన చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కాబడిన ఈ చిత్రం మొదటి రోజు నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ అందుకొని వీకెండ్ కి అలా మంచి కలెక్షన్ ని రాబట్టింది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం యూఎస్ వసూళ్లకు సంబంధించి లేటెస్ట్ కౌంట్ బయటకి వచ్చింది.

ఈ చిత్రం ఇప్పటి వరకు యూఎస్ లో 5 లక్షల 50 వేల డాలర్స్ ని వసూలు చేసింది. అంతే కాకుండా ఈ వీక్ స్టార్ట్ డే సోమవారం కూడా శ్యామ్ సింగ రాయ్ డీసెంట్ హోల్డ్ ని అందుకుందట. అలానే ఈ చిత్రానికి అదనపు స్క్రీన్స్ కూడా యాడ్ చేస్తున్నారట. దీని బట్టి శ్యామ్ సింగ రాయ్ కి లాంగ్ రన్ లో మంచి మార్క్ వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందివ్వగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :