వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “శ్యామ్ సింగరాయ్”

Published on Mar 9, 2022 11:09 am IST

నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం ను నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మించడం జరిగింది. థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకొని, మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెర పై ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ చిత్ర త్వరలో జెమిని టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం కి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :