నైజాం లో “శ్యామ్ సింగరాయ్” దూకుడు!

Published on Dec 24, 2021 11:04 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం నేడు థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం విడుదల అయిన అన్ని చోట్ల హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తి దూసుకు పోతుంది. అయితే నైజాం ఏరియా లో మాత్రం ఈ చిత్రం కి సంబంధించిన అన్ని షో లు బుక్ అయ్యాయి. మొత్తం 90 శాతం కి పైగా అన్ని షో లు బుక్ కావడం విశేషం.

అయితే సాయి పల్లవి, కృతి శెట్టి మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి మొదటి రోజు వసూళ్లు సాలిడ్ గా ఉండే అవకాశం ఉంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం తో ఎలాంటి వసూళ్లు రాబడుతోంది అనేది ఆసక్తి గా మారింది.

సంబంధిత సమాచారం :