“శ్యామ్ సింగరాయ్” డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్!

Published on Sep 23, 2021 11:40 am IST

నాని హీరోగా, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లేడీ లీడ్ రోల్స్ లో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం ను థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఒక విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్ల లో విడుదల అయిన అనంతరం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జంగ సత్యదేవ్ కథ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :