శ్యామ్ సింగరాయ్ మేకింగ్ వీడియో విడుదల!

శ్యామ్ సింగరాయ్ మేకింగ్ వీడియో విడుదల!

Published on Dec 23, 2021 6:06 PM IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్దం గా ఉంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి మేకింగ్ వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం ఏ రేంజ్ లో కష్టపడింది అనేది ఈ వీడియో ను చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రం లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళి శర్మ, అభినవ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు