కృతి శెట్టి కి శ్యామ్ సింగరాయ్ చిత్ర యూనిట్ బర్త్ డే విషెస్!

Published on Sep 21, 2021 5:30 pm IST

నాని హీరోగా, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగారాయ్. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే నేడు కృతి శెట్టి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియో ను విడుదల చేయడం జరిగింది. శ్యామ్ సింగరాయ్ లో కృతి శెట్టి ఎలా ఉంటుంది అనే దాని పై క్లారిటీ వచ్చింది.

నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :