“శ్యామ్ సింగరాయ్” ప్రీ రిలీజ్ వేడుక కి డేట్ ఫిక్స్!

“శ్యామ్ సింగరాయ్” ప్రీ రిలీజ్ వేడుక కి డేట్ ఫిక్స్!

Published on Dec 10, 2021 9:30 PM IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ను శ్యామ్ సింగరాయ్ రాయల్ ఈవెంట్ గా డిసెంబర్ 14 వ తేదీన సాయంత్రం 5 గంటలకు వరంగల్ లోని రంగలీల మైదానం లో జరపనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు