రేపే “శ్యామ్ సింగరాయ్” ట్రైలర్ విడుదల…సరికొత్త ఫోటో రిలీజ్!

Published on Dec 13, 2021 1:01 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం ను నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

డిసెంబర్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను రేపు విడుదల చేయనుంది చిత్ర యూనిట్. అంతేకాక ఈ చిత్రం కి సంబంధించిన మరొక ఫోటో ను చిత్ర యూనిట్ తాజాగా షేర్ చేయడం జరిగింది. సాయి పల్లవి మరియు నాని లు కలిసి ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :