ఆయన 40 ఏళ్ల క్రితమే ‘కల్కి’ స్టార్ట్ చేశారట

ఆయన 40 ఏళ్ల క్రితమే ‘కల్కి’ స్టార్ట్ చేశారట

Published on Jul 1, 2024 5:30 PM IST

‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొత్తానికి అద్భుత విజయాన్ని సాధించింది. పైగా మొద‌టి రోజు నుంచే క‌లెక్ష‌న్ల సూనామీతో దూసుకుపోతుంది. మొత్తమ్మీద ఎక్కడ చూసినా కల్కి రాకతో థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్కి సినిమాపై ప్రభాస్‌ పెద్దమ్మ, కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

శ్యామలా దేవి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘దాదాపుగా 40 ఏళ్ల క్రితం కృష్ణం రాజు గారు కల్కి అనే పేరు పెట్టి ఓ సినిమా స్టార్ట్ చేశారు. అప్పట్లో ఆ సినిమాకి సంబంధించి షూట్ చేసిన సీన్స్ కూడా కొన్ని ఇంట్లో ఉన్నాయి. ఐతే, అప్పుడు ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో నాకు తెలియదు. కానీ, అనుకోకుండా ఇప్పుడు ఆ పేరుతో ప్రభాస్ సినిమా రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కృష్ణం రాజు, ప్రభాస్ ఇద్దరూ ఫలితాన్ని ఆశించి ఏదీ చేయరు’ అంటూ శ్యామలా దేవి చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు