సిద్దార్థ ‘టక్కర్’ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్

Published on May 25, 2023 7:17 pm IST

సిద్దార్ధ హీరోగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా తాజాగా తెరకెక్కిన సినిమా టక్కర్. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే టీజర్‌‌‌‌, రెండు సాంగ్స్‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన టీమ్ తాజాగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. ఇక ట్రైలర్ లో యాక్షన్, లవ్, రొమాంటిక్, కామెడీ, అంశాలు బాగున్నాయి. ట్రైలర్ ని బట్టి ఈ మూవీ కమర్షియల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ అని అర్థమవుతోంది.

ఈ మూవీ జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. విషయం ఏమిటంటే ప్రస్తుతం టక్కర్ ట్రైలర్ 30 లక్షల వ్యూస్ తో ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ తో కొనసాగుతోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు కార్తీక్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు సిద్దార్థ నటన ఇందులో హైలైట్ గా నిలుస్తుందని అంటోంది యూనిట్. మరి రిలీజ్ తరువాత టక్కర్ మూవీ ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :