టాప్ లో ట్రెండ్ అవుతోన్న సిద్ధ టీజర్!

Published on Nov 30, 2021 12:32 am IST


మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి సిద్ధ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకూ కూడా ఈ టీజర్ కి 11 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. అంతేకాక యూ ట్యూబ్ లో టాప్ లో దూసుకు పోతుంది. మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ ల అప్పియరెన్స్ పీక్స్ లో ఉండటం తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది.

టీజర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :