
టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. దిల రాజు నిర్మాతగానే కాకుండా నైజాం డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తారు. అలాంటిది ఇప్పుడు ఆయన పేరు మీదే ఓ సినిమా రానుంది. అదికూడా సిద్దార్థ్ హీరోగా నటించిన ఓ సినిమాకి ఈ పేరు పెట్టడం విశేషం. ఇక అసలు విషయంలోకి వెళితే… సిద్దార్థ్ హీరోగా లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటించిన తమిళ సినిమా ‘జిగర్తాండ’. ఈ సినిమా గత సంవత్సరం తమిళంలో రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వడమే కాకుండా విమర్శకులను కూడా అమితంగా మెప్పించింది.
తాజాగా 62వ నేషనల్ అవార్డ్స్ బరిలో కూడా ఈ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ విభాగాల్లో నేషనల అవార్డ్స్ ను గెలుచుకుంది. ‘పిజ్జా’ సినిమా ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబీ సింహా నెగటివ్ షేడ్స్ లో కనిపించాడు. ఈ సినిమాని తెలుగు డబ్ చెయ్యడానికి నిర్ణయించుకున్నారు. ఈ డబ్బింగ్ సినిమాకి తెలుగులో ‘దిల్ రాజు’ అనే టైటిల్ ని పెట్టడమే కాకుండా, దమ్ముంటే కాస్కో అనే ట్యాగ్ లైన్ ని కూడా పెట్టారు. ప్రసతుతం డబ్బింగ్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు.