మరో డేట్ కి పోస్ట్ పోన్ అయ్యిన సిద్ధార్థ్ “టక్కర్”.!

Published on May 19, 2023 11:09 am IST

కోలీవుడ్ మరియు మన టాలీవుడ్ లో కూడా మంచి ఫేమ్ ఉన్నటువంటి హీరోస్ లో ఎవర్ గ్రీన్ యంగ్ హీరో సిద్ధార్థ్ కూడా ఒకడు. మరి ఇప్పుడు సిద్ధార్థ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “టక్కర్” తో అయితే రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ జి క్రిష్ తెరకెక్కించాడు. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ ఇది వరకే ఈ 2మే 6న రిలీజ్ కావాల్సి ఉంది.

మేకర్స్ ఈ డేట్ ని ముందుగా లాక్ చేయగా ఇప్పుడు అయితే ఈ డేట్ నుంచి మార్చినట్టు గా కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రాన్ని ఇపుడు పోస్ట్ పోన్ చేసి ఈ జూన్ 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈ చిత్రంలో దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రానికి నివాస్ కే ప్రసన్న సంగీతం అందించగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు మరియు టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :