విడుదలకు సిద్దమైన సిద్దార్థ్ సినిమా !
Published on Nov 7, 2017 12:10 pm IST

హీరో సిద్దార్థ్ తాజా చిత్రం ‘అవల్’ తమిళనాట గత శుక్రవారం విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. వసూళ్లు కూడా బాగుండటంతో సినిమా విజయం దిశగా దూసుకుపోతోంది. దీంతో ఎన్నాళ్ల నుండో సిద్దార్థ్ కోరుకుంటున్న వియం దక్కినట్లైంది. ఇకపోతే ఈ చిత్రాన్ని తెలుగులో ‘గృహం’ పేరుతో గత వారమే విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది కాస్త ఆగిపోయింది. మళ్ళీ అన్ని ఇబ్బందుల్ని దాటుకుని ఈ శుక్రవారం అనగా నవంబర్ 10వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ హర్రర్ థ్రిల్లర్ ను మిలింద్ రావ్ డైరెక్ట్ చేశారు. తెలుగుతో పాటు హిందీలో కూడా 10వ తేదీనే ‘ది హౌస్ నెక్స్ట్ డోర్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మరి తమిళంలో సిద్దార్థ్ కి మంచి ఫలితాన్ని ఇచ్చిన ఈ చిత్రం తెలుగు, హిందీలో ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook